కల్కి ఎడి2898 రిలీజ్ ట్రైలర్‌

June 22, 2024
img

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపికా పడుకొనే, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు చేసిన కల్కి ఎడి2898 సినిమా ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ విడుదల చేసింది. 

ఈ ట్రైలర్‌లో సినిమా కధపై మరింత స్పష్టత ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్‌. కలియుగంలో దుష్టశక్తుల బారి నుంచిఓ ప్రపంచాన్ని కాపాడేందుకు దైవాంశ సంభూతుడు జన్మించడం, అతనికి మహాభారతంలోని అశ్వధామ సహాయపడిన్నట్లు ట్రైలర్‌లో చూపారు. దీనిలో తొలిసారిగా అతీంద్రియ శక్తులు కలిగిన ఓ వృద్ధుడు రూపంలో ఉన్న కమల్ హాసన్‌ని కొన్ని సెకన్లపాటు చూపించారు. 

ప్రభాస్‌ని వీరాధివీరుడుగా చూపిస్తూ ఆయనతో కామెడీ చేయించడం వెరైటీగా ఉంది. అశ్వథామ (అమితాబ్ బచ్చన్), భైరవ (ప్రభాస్‌) మద్య ఫైట్, గ్రాఫిక్స్, విజువాల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయి. కనుక రిలీజ్ ట్రైలర్‌తో కల్కి ఎడి2898పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ అవడం ఖాయంగానే కనిపిస్తోంది. హిట్ అయితే ఈ సినిమా ప్రభావం ముందుగా భారతీయ సినీ పరిశ్రమ పడుతుంది కనుక ఇటువంటి మరిన్ని అద్భుత ప్రయోగాలు మొదలవవచ్చు. ఇప్పటికే ఆస్కార్ అవార్డుతో భారతీయ సినీ పరిశ్రమకు అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు లభించింది. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ పేరు ప్రపంచ దేశాలలో మారు మ్రోగిపోతుంది. 

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. 


Related Post