పది భాషల్లో సూర్య కంగువా... అక్టోబర్ 10న విడుదల

June 30, 2024


img

ప్రభాస్‌-నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి ఎడి2898 ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌ హీరోగా వస్తున్న భారతీయుడు-2, రామ్ చరణ్‌ హీరోగా గేమ్ చేంజర్‌ సినిమాలను కూడా చాలా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో తెలుగు సినిమాలు అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్ చేసుకొని తీస్తుండటం అందరికీ గర్వకారణమే. 

దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు సినీ పరిశ్రమతో ఆ స్థాయిలో పోటీ పడగల శక్తి కోలీవుడ్‌కి ఉంది. తాజాగా సూర్యా హీరోగా శివ దర్శకత్వంలో కంగువ సినిమా కూడా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఏకంగా 10 భారతీయ భాషల్లో, కొన్ని విదేశీ భాషల్లో తీస్తున్నామని సినీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ సినిమాలలో భారీ బడ్జెట్‌తో తీస్తున్న అతి పెద్ద సినిమాలలో కంగువా నిలుస్తుందని చెప్పారు. అక్టోబర్ 10వ తేదీన కంగువ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని తెలిపారు. 

ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా చేస్తోంది. జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, బాబీ డియోల్, ఆనంద్ రాజ్, దీపా వెంకట్, రవి రాఘవేంద్ర, కెఎస్ రవికుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు దర్శకత్వం: శివ, కధ: శివ, ఆదినారాయణ, డైలాగ్స్: మదన్ కార్కే, పాటలు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: వెట్రీ పళనిస్వామి. నిర్మాణ సంస్థలు: స్టూడియో గ్రీన్, యూవీ క్రియెషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియో. 


Related Post

సినిమా స‌మీక్ష