కల్కి ఎడి2898 ఫస్ట్-డే కలక్షన్స్‌ ఎంతంటే...

June 28, 2024


img

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా జూన్ 27న కల్కి ఎడి2898 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అందరూ ముక్త కంఠంతో కల్కి ఎడి2898 సినిమాపై, దానిని అంత అద్భుతంగా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

మహానటి వంటి సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్‌, ఇంత అద్భుతంగా తీయగలడని ఎవరూ ఊహించలేదు. కానీ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుంచే క్రమంగా సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

కనుక ఈ హైప్ కారణంగా చాలా భారీ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సినిమా ఏ మాత్రం బాగోకపోయినా ఇంత శ్రమ, ఖర్చు అన్నీ వృధా అయ్యేవి. కానీ అందరి అంచనాలకు మించి మూడు ప్రపంచాలతో సినిమా చూపించి నాగ్ అశ్విన్‌ మాయ చేశాడు. ముఖ్యంగా విదేశాలలో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యింది. 

భారీ అంచనాల నడుమ విడుదలైన కల్కి ఎడి2898 సినిమా మొదటి రోజు గ్రాస్ కలక్షన్స్‌ 191.50 కోట్లు అని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి షాంపెయిన్ బాటిల్ పట్టుకున్న ప్రభాస్‌ ఫోటోని షేర్ చేస్తూ పండగ చేసుకుందామని ట్వీట్‌ చేసింది. 

తొలిరోజు కలక్షన్స్‌ గురించి మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి-2, సలార్, కేజీఎఫ్-2ల గురించి చెప్పుకోకతప్పదు.    

కల్కి ఎడి2898: 191.50 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌: 223 కోట్లు, బాహుబలి-2: 218 కోట్లు, సలార్‌-2: 178.70 కోట్లు, కేజీఎఫ్-2:165 కోట్లు కలక్షన్స్‌ సాధించాయి. వీటిలో మూడు సినిమాలు ప్రభాస్‌ నటించినవే కావడం మరో విశేషం.  



Related Post

సినిమా స‌మీక్ష