అమెజాన్ ప్రైమ్‌లో సత్యభామ...

June 28, 2024


img

చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టి మగధీరతో మహారాణిలా తెలుగు సినీ పరిశ్రమని ఏలిన అందాల కాజల్ అగర్వాల్ మళ్ళీ చాలా కాలం తర్వాత సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసరుగా నటించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా జూన్ 7న థియేటర్లలో విడుదలై అందరినీ మెప్పించింది. మూడు వారాలు కూడా కాక ముందే ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. 

 ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

షీ టీమ్‌లో ఏసీపీగా పనిచేస్తున్న సత్యభామని భర్త వేధింపులకు గురవుతున్న హసీనా అనే మహిళ ఆశ్రయిస్తుంది. అయితే అంతలోనే ఆమెను భర్త దారుణంగా హత్య చేయడంతో అసలు కధ మొదలవుతుంది.

సత్యభామ దర్యాప్తులో ఆమె భర్త ఇంకా అనేక మంది మహిళలను ఇలాగే వేధించి హత్యలు చేశాడనే కొత్త విషయం బయటపడుతుంది. ఈ కేసుని ఆమె ఏవిదంగా హ్యాండిల్ చేసింది? చివరికి ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కధ.

ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది కనుక సత్యభామ గురించి చెప్పుకోవడం కంటే చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష