భారతీయుడు-2 ట్రైలర్‌... నేటికీ అదే కమల్!

June 25, 2024


img

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారతీయుడు-2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఈరోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ చూసినప్పుడు ఇన్నేళ్ళపాటు కమల్ హాసన్ ఇండస్ట్రీలో అదే స్థాయిలో ఎలా నిలబడగలిగారో అర్దం అవుతుంది. కమల్ హాసన్ యాక్షన్ సీన్స్, నటన అద్భుతంగా ఉన్నాయి.  

భారతీయుడు మొదటి భాగంలో స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అవినీతిపరులను ఏవిదంగా అంతమొందించాడో చూపారు. ఇప్పుడు మరింత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున దానికి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2 మరింత అద్బుతంగా ఉండబోతోందని ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది. 

 ఈ సినిమాలో కమల్ హాసన్, ఎస్‌జె సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, సిద్ధార్ధ్, బాబీ సింహా, వివేక్, బాలీవుడ్‌ నటులు గుల్షన్ గ్రోవర్, పీయూష్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, అఖిలేంద్ర మిశ్రా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, మనోబాల, ప్రియా భవానీ శంకర్, నెడుమూడి వేణు, ఢిల్లీ గణేశ్, జగన్, కాళిదాస్, జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, డైలాగ్స్: హనుమాన్ చౌదరి, పాటలు: సుద్దాల అశోక్ తేజా, శ్రీమణి, కెమెరా: రవి వర్మన్, కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్, బాబా భాస్కర్, యాక్షన్: అంభైరవ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మేకప్: లీగసీ ఎఫెక్ట్స్, వాన్స్ హార్ట్ వెల్, పట్టణం రషీద్, ఏఆర్ అబ్దుల్ రజాక్ చేశారు. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ మూవీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు.     



Related Post

సినిమా స‌మీక్ష