కల్కి ఎడి2898 టికెట్‌ ధరలు పెంపుకి గ్రీన్ సిగ్నల్‌

June 23, 2024


img

ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి ఎడి2898 సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసినందున మొదటి పది రోజులు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు వైజయంతీ మూవీఎస్ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

సినిమా విడుదలైన రోజు నుంచి జూలై 4 వరకు 8 రోజులు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు అనుమటించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమటించింది. జూన్ 27 నుంచి జూలై 4వరకు ప్రతీ రోజూ ఉదయం 5.30 గంటలకు అదనపు షో వేసుకునేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు-పవన్‌ కళ్యాణ్‌ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున అక్కడ కూడా కల్కి ఎడి2898 సినిమా అదనపు షోలకు, టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతించడం ఖాయమే. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష