వివాదంలో రకుల్ ప్రీత్ సినీ నిర్మాణ సంస్థ

June 23, 2024


img

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ భర్త జాకీ భగ్నానికి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సినీ నిర్మాణ సంస్థ వివాదంలో చిక్కుకుంది. ఆ సంస్థలో పని చేస్తున్న ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు చెందిన కొందరు తమకు  ఏడాదిగా జీతాలు చెల్లించడం లేదంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. 

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో ఇటీవల ఆ సంస్థ తీసిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకొని  దాని కోసం బడ్జెట్‌కు మించి చాలా భారీగా ఖర్చు పెట్టేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్రంగా నష్టపోయింది. 

ఆ సినిమా నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరిగిపోవడంతో తమకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని జాకీ భగ్నానీ చెప్పారని, కానీ సినిమాలో నటించిన నటీనటులందరికీ పారితోషికాలు చెల్లించిఒనప్పుడు తమకు జీతాలు ఎందుకు ఇవ్వలేరని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఏడాదిగా జీతాలు చెల్లించకపోవడంతో ముంబయి వంటి మహానగరంలో కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, కనుక ఇప్పటికైనా రకుల్ ప్రీత్ సింగ్‌ జోక్యం చేసుకొని తమకు తక్షణమే జీతాలు చెల్లించాలని ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కు చెందిన కొందరు సభ్యులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.     



Related Post

సినిమా స‌మీక్ష