కల్కి ఎడి2898: ఇప్పటి ఆలోచన కాదట!

June 18, 2024


img

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా కల్కి ఎడి2898 మరో వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్‌ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నారు. 

తాను చిన్నప్పుడు పాతాళ భైరవి, ఆ తర్వాత ఆదిత్య 369వంటి సినిమాలను, స్టార్ వార్స్ వంటి హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవాడినని చెప్పారు. అయితే హాలీవుడ్ సినిమాలు వారి నేటివిటీకి సరిపోతాయి కానీ మనకు సరిపోవు. కనుక మనం ఎలా తీస్తే బాగుంటుంది? అని చిన్నప్పటి నుంచే ఆలోచించేవాడినని చెప్పారు. 

మనకు రామాయణ మహాభారతం వంటి మహాద్భుతమైన కధలున్నప్పుడు వాటిని బేస్ చేసుకొని ఎందుకు సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయకూడదు? అనే ఆలోచనల నుంచి పుట్టిందే ఈ కల్కి ఎడి2898 సినిమా అని చెప్పారు. 

ప్రతీయుగంలో ఓ రాక్షసుడు...వాడిని అంతం చేయడానికి ఏదో ఓ రూపంలో భగవంతుడు పుడుతుంటాడు. ఈ కలియుగంలో కూడా అటువంటి రాక్షసుడిని అంతమొందించి ఈ ప్రపంచాన్ని కాపాడే ఓ సూపర్ హీరోని సృష్టిస్తే... అనే ఆలోచనతో ఈ కల్కి ఎడి2898 కధ మొదలుపెట్టాను కానీ అది పూర్తిచేయడానికి దాదాపు 5 ఏళ్ళు సమయం పట్టింది,” అని నాగ్ అశ్విన్‌ తన సినిమా గురించి చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష