వరకట్న వేధింపుల కేసు నుంచి పృధ్వీరాజ్‌కు విముక్తి

June 27, 2024
img

ప్రముఖ తెలుగు సినీ నటుడు పృధ్వీరాజ్‌కు వరకట్న వేధింపుల కేసు నుంచి విముక్తి లభించింది. ఆయన నుంచి విడిపోయి విజయవాడలో తల్లితండ్రుల వద్ద ఉంటున్న ఆయన భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు  విజయవాడ పోలీసులు 2016లో పృధ్వీరాజ్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. 

ఆయన భార్య శ్రీలక్ష్మి ఇటీవలే ఆయనపై మరో పిటిషన్‌ కూడా వేసింది. తనకు నెలకు రూ.8 లక్షల భరణం చెల్లిస్థానని కోర్టులో అంగీకరించిన తన భర్త అది చెల్లించడం లేదంటూ శ్రీలక్ష్మి పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ కొనసగౌతుండగానే విజయవాడ 2వ అధనపు మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు వరకట్న వేధింపుల కేసు నుంచి విముక్తి కల్పించింది. 

దీనిపై సుదీర్గ విచారణ అనంతరం నేడు తుది తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి మాధవీదేవి, పృధ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మిని వరకట్నం కోసం వేధించారనేందుకు ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఆయనను నిర్ధోషిగా ప్రకటించారు. శ్రీలక్ష్మి వేసిన ఈ కేసుని కొట్టేస్తున్నట్లు ప్రకటించారు. 

Related Post