ఈసారి 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం

June 18, 2024
img

ఈ ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన వినాయక చవితి పండుగ వస్తోంది. కనుక అప్పుడే దేశవ్యాప్తంగా భారీ గణేశ్ విగ్రహాల తయారీకి సన్నాహాలు మొదలయ్యాయి. సోమవారం ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నిర్మాణానికి ముందు ఆనవాయితీగా చేసే కర్రపూజ జరిగింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని 70 అడుగుల ఎత్తు ఉండేలా తయారు చేయిస్తున్నాము. అయినప్పటికీ పూర్తిగా పర్యావరణ హితమైన విగ్రహంగా ఉంటుంది.

ఈసారి గణేశ్ ఉత్సవాలలో ప్రతీ భక్తుడికి తప్పనిసరిగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తాము. మరింత వైభవంగా జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ఆయన సూచన మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాము. త్వరలోనే గణేశ్ విగ్రహం చిత్రాన్ని విడుదల చేస్తాము,” అని చెప్పారు.

Related Post