ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్‌... మార్గదర్శకాలు జారీ!

July 04, 2024


img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులు బదిలీల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ బదిలీలపై నిషేదం ఎత్తివేసి గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతోపాటు వెంటనే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు... 

• 2024, జూన్ 30నాటికి కనీసం రెండేళ్ళు సర్వీసు పూర్తి చేసినవారికి, నాలుగేళ్ళు ఒకే చోట పనిచేస్తున్నవారు బదిలీలకు అర్హులు. 

• ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు ఈ షరతు వర్తించదు. ఒకే చోటికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే  నిబందనల ప్రకారం బదిలీ చేయవచ్చు. మొట్ట మొదటి ప్రాధాన్యత భార్యాభర్తల బదిలీలలకే. 

• 2025, జూన్ 30లోగా పదవీ విరమణ చేసేవారికి నాలుగేళ్ళ నిబందన వర్తించదు. వారిని బదిలీ చేయకూడదు.

• ఒక శాఖలో ఒకే క్యాడర్‌లో 40 శాతంకి మించి బదిలీ చేయరాదు. 

• బదిలీ కోరుకునే ఉద్యోగులు 5 ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో సూచించాల్సి ఉంటుంది. 

• ఒకే చోటికి ఎక్కువమంది బదిలీ కోరుకున్నప్పుడు, నిబందనల ప్రకారం వారిలో సీనియారిటీ వగైరాలను పరిగణనలోకి తీసుకొని ఎక్కువ పాయింట్స్ వచ్చినవారికే ఆ స్థానం కేటాయించాలి. 

బదిలీ ప్రక్రియ షెడ్యూల్: 

జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగులు 5 ఆప్షన్స్ తో దరఖాస్తులు సమర్పించాలి. 

జూలై 13 నుంచి 18లోగా ఆ ఆప్షన్స్ ప్రకారం శాఖాధిపతులు బదిలీల మాస్టర్ లిస్ట్ సిద్దం చేయాలి. 

జూలై 19, 20 తేదీలలో అన్ని శాఖలు బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పటి నుంచే సదరు ఉద్యోగి తాను పనిచేస్తున్న చోట నుంచి రిలీవ్ చేయబడిన్నట్లు పరిగణించబడతారు. అప్పటి నుంచి మూడు రోజులలోగా కొత్త చోట జాయినింగ్ రిపోర్ట్ చేయాలి. 

జూలై 20వ తేదీకి బదిలీల ప్రక్రియ ముగుస్తుంది. 

జూలై 21 నుంచి బదిలీలపై మళ్ళీ నిషేధం అమలులోకి వస్తుంది.


Related Post