మానేరు వంతెనలో కూలిన 5 గడ్డర్లు

July 03, 2024


img

పెద్దపల్లి జిల్లా ఓడేడు మండలంలో మానేరు వంతెన నిర్మాణ పనులు గత 9 ఏళ్ళుగా సాగుతూనే ఉన్నాయి. ఆ వంతెన నిర్మాణం పూర్తికాకముందే గర్మిళ్ళపల్లి వైపు గల 17,18 నంబర్ పిల్లర్లపై అమర్చిన  5 గర్డర్లు నిన్న సాయంత్రం కూలిపోయాయి.

ఇన్నేళ్ళు వంతెన నిర్మాణం పూర్తికాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంటే, నిర్మాణంలో ఉన్న వంతెనపై క్రేన్ల సాయంతో అమర్చిన భారీ గర్డర్లు కూలిపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.

గుత్తేదారు సంస్థకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వలన పనులు ఆలస్యమైన్నట్లు తెలుస్తోంది. బిల్లులు చెల్లించనప్పటికీ పని పూర్తిచేయాలని ఒత్తిడి చేస్తుండటంతో గుత్తేదారు సంస్థ నాసిరకం పనులు చేసి ‘మమ’ అనిపించేయాలనుకునట్లు కూలిన గర్డర్లు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని కేసీఆర్‌, కేటీఆర్‌ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ తొమ్మిదేళ్ళలో మానేరు వంతెనను ఎందుకు పూర్తిచేయకపోవడానికి, గర్డర్లు కూలిపోవడానికి కూడా వారే పూర్తి బాధ్యత తీసుకోవలసి ఉంటుంది కదా?

కేసీఆర్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయి, రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే 7 నెలలు. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం మానేరు వంతెన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి కేసీఆర్‌ కంటే గొప్ప పాలన అందిస్తున్నామని నిరూపించుకుంటే బాగుంటుంది. 


Related Post