అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పరిస్థితి విషమం

July 03, 2024


img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం రాత్రి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ మళ్ళీ బ్రతకాలనే ఆశతో ఆయనే 108కి ఫోన్ చేయడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానీ పురుగుల మందు త్రాగడం వలన ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయని, లివర్ కూడా దెబ్బ తిందని వైద్యులు చెప్పారు. డయాలసిస్ చేస్తూ చికిత్స అందిస్తున్నామని కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. 

ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకునే ముందు తన సర్వీస్ రివాల్వర్‌ని పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. ఆ తర్వాత అధికారులు, సహచరులు వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాని పై అధికారులకు, బంధుమిత్రులకు ఫోన్లో మెసేజ్‌లు పెట్టారు.

తాను అవినీతిపరుడునంటూ కొందరు నా గురించి పత్రికలలో చెడుగా వార్తలు వచ్చేలా చేశారు. పై అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బంధుమిత్రులకు ఫోన్లో మెసేజ్‌లు పెట్టారు. ఎవరెవరు తనను ఏవిదంగా వేధించారో వివరాలన్నీ తన ఫోన్లోనే ఉన్నాయని తెలిపారు.

వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ తాను చనిపోతే భార్యాపిల్లలు అనాధలైపోతారనే ఆలోచనకలగడంతో తానే 108కి ఫోన్ చేశానని ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ తెలిపారు.


Related Post