విద్యుత్ రంగం ప్రయివేటీకరణ కోసమే ఆదానీకి: బిఆర్ఎస్

June 30, 2024


img

హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం చాలా కష్టంగా మారడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసే బాధ్యతని ఆదానీ గ్రూప్‌కి అప్పగించాలని భావిస్తున్నట్లు సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనిపై మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ విమర్శించారు. 

“రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు వేస్తున్న తొలి అడుగే ఇదనీ మేము భావిస్తున్నాము. ప్రైవెట్  సంస్థలతో ఎటువంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో అందరికీ తెలుసు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే వారు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. 

ఇప్పుడు పాతబస్తీకి మాత్రమే ఇది పరిమితమని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ రేపు రాష్ట్రం అంతటా దానికే అప్పగించక మానదు. అప్పుడు విద్యుత్ సబ్సీడీలు, రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. మెల్లమెల్లగా సబ్సీడీలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. 

గతంలో మా ప్రభుత్వంపై కూడా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఒత్తిడి వచ్చింది. కానీ కేసీఆర్‌ ప్రాణం పోయినా అందుకు ఒప్పుకోమని తేల్చి చెప్పారు. అలాగే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలనే ప్రతిపాదనని కూడా కేసీఆర్‌ నిర్ద్వందంగా తిరస్కరించారు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయివేటీకరణ ప్రతిపాదనపై రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది,” అని జగదీష్ రెడ్డి అన్నారు. 


Related Post