తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ జారీ

June 29, 2024
img

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకుగాను నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ శుక్రవారం రాత్రి జారీ అయ్యింది. పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ శ్రీదేవసేన డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ జారీ చేశారు.

ఇదివరకు దీని కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో జూలై 17 నుంచి 31వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. కానీ జూలై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. మొత్తం 13 రోజుల పాటు సాగే ఈ పరీక్షల మద్య జూలై 21,27,28,29, ఆగస్ట్ 3,4 తేదీలలో విరామం ఉంటుందని తెలియజేసింది. 

మొట్ట మొదట జూలై 18న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు మొదలవుతాయి. చివరిగా ఆగస్ట్ 5వ తేదీన హిందీ లాంగ్వేజ్ పండిట్ పరీక్షతో ఇవి ముగుస్తాయి. ఈ పరీక్షలన్నీ ప్రతీరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో ఆన్‌లైన్‌లో నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. 

ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 11,062 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటికి మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 

Related Post