వాస్తవ అంచనాలతోనే తెలంగాణ బడ్జెట్‌: సిఎం రేవంత్‌

June 28, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతోంది. ఇంతకాలం కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌ ఏవిదంగా అందరూ చూశారు. కనుక ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ బడ్జెట్‌ ఏవిదంగా ఉండబోతోందనే ఉత్సకత అందరిలో ఉంటుంది. 

అయితే తమ బడ్జెట్‌ ఊహాజనితమైన ఆదాయపు లెక్కలతో కాకుండా వాస్త అంచనాలకు అనుగుణంగానే ఉంటుందని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌లాగ ఊహానితమైన అంచనాలతో భారీ బడ్జెట్‌ చూపించి ప్రజలను మభ్యపెట్టదలచుకోలేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మొదలు పెడతామని చెప్పారు. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని వాటికి నెలకు రూ.7,000 కోట్లు చొప్పున చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేయడమే కాకుండా 7 నుంచి 11 శాతం వడ్డీతో అప్పులు తీసుకోవడం వలన ప్రభుత్వంపై ఈ రుణభారం పెరిగిపోయిందన్నారు. కనుక ఈ వడ్డీ భారం తగ్గించమని   కేంద్రాన్ని కోరుతున్నాము. కేంద్రం సహకరిస్తే కొంత భారం తగ్గుతుంది అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.   

పంటరుణాల మాఫీకి సంబందించి రెండు రోజులలో మార్గదర్శకాలు జారీ చేస్తామని, రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈ రుణ మాఫీకి తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడం లేదని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. పంట రుణాల మాఫీ తర్వాత రైతు బంధు పధకం అమలుచేయడంపై దృష్టి పెడతామని దానినీ వీలైనంత త్వరగానే అమలుచేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.


Related Post