కేసీఆర్‌ ఎంత బుజ్జగిస్తున్నా ఎవరూ ఆగట్లే

June 28, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మొన్నే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై, పార్టీ వీడవద్దని బుజ్జగించారు. కానీ ఆయన ఎంత బుజ్జగిస్తున్నా ఎమ్మెల్యేలు వాటిని పాట్టించుకోవడం లేదు. ఎవరూ ఆగట్లేదు.

కేసీఆర్‌ బుజ్జగించి 24 గంటలు గడవక మునుపే  చేవెళ్ళ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీ వెళ్ళి సిఎం రేవంత్‌ రెడ్డి, దీపాదాస్ మున్షీ తదితరుల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరిపోయారు.

దీంతో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన్నట్లయింది. కనుక ఆ మేరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య పేరుగగా, బిఆర్ఎస్ పార్టీకి 32 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.  

లోక్‌సభ ఎన్నికల తర్వాత ముందుగా మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ కుమార్‌ (జగిత్యాల), ఇప్పుడు కాలే యాదయ్య (చేవెళ్ళ) బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ చేరికలు ఇక్కడితో ఆగేవి కావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు చెపుతూనే ఉన్నారు.

సుమారు 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని లోక్‌సభ ఎన్నికల సమయంలో చెప్పారు. అంతమంది కాకపోయినా మరో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Related Post