జియో ఛార్జీలు పెరిగాయ్.., రేపు మిగిలిన కంపెనీలు కూడా?

June 27, 2024
img

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తమ మొబైల్ ఫోన్ ఛార్జీ ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జియోలో ఉన్న అన్ని రీఛార్జ్ ప్లాన్లపై 12.5 నుంచి 25 శాతం వరకు ఛార్జీలు పెంచబోతున్నట్లు నేడు ప్రకటించింది. జూలై 3వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయని తెలియజేసింది. 

ఇవికాక ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ తో కూడిన జియో సేఫ్, జియో స్వాంటర్ సెక్యూర్, జియో ట్రాన్స్‌లేట్ అనే మూడు రకాల కొత్త యాప్‌లను ప్రవేశపెడుతున్నట్లు జియో ప్రకటించింది. వీటిలో ట్రాన్స్‌లేట్ యాప్ ఛార్జీ నెలకు రూ.99, సేఫ్ ప్లాన్ నెలకు రూ.199 ఛార్జీలుగా నిర్ణయించిన్నట్లు ప్రకటించింది. అయితే జియో వినియోగదారులకు ఈ రెండు సేవలు ఒక ఏడాది పాటు పూర్తి ఉచితంగా అందజేస్తామని తెలిపింది. 

ఇదివరకు వాటి వినియోగదారులను ఆకర్షించేందుకు జియో అతి తక్కువ ధరలకు మొబైల్ సేవలు అందించింది. ఇప్పుడు జియోకి దేశవ్యాప్తంగా భారీగా వినియోగదారులు ఏర్పడటంతో ధరలు పెంచుతోంది. కనుక ఇప్పుడు మిగిలిన కంపెనీలు జియోతో పోటీ పడుతూ ధరలు పెంచేస్తాయా లేదా దీనిని ఓ వ్యాపార అవకాశంగా తీసుకొని ధరలు పెంచకుండా కొత్త వినియోగదారులను ఆకర్షిస్తాయా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Related Post